DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వెంకట్ యాదవ్ మృతి ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ‘హాలో ఫ్రెండ్స్’ వెంకట్ యాదవ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే అభిమానులు, స్నేహితులు, సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ యాదవ్ తన ప్రత్యేక శైలి వీడియోలు, మాట్లాడే తీరు, వినోదాత్మక కంటెంట్‌తో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘హాలో ఫ్రెండ్స్.. మీ వెంకట్ యాదవ్ అనే పిలుపుతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన అకాల మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Admin
DNB News