Saturday, 19 September 2026 06:12:04 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆదోనిలో భాష్యం, చైతన్య, నారాయణ విద్యాసంస్థల అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి – PDSO, DSF హెచ్చరిక..

Date : 01 May 2026 02:50 PM Views : 96

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఉన్న భాష్యం, చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని PDSO, DSF విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ… ఈ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ, సమ్మర్ హాలిడేస్ ప్రకటించినప్పటికీ భాష్యం, చైతన్య, నారాయణ సంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహించడం దుర్మార్గమని అన్నారు. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై సెలవు రోజుల్లో కూడా అడ్మిషన్లు చేయాలని ఒత్తిడి తేవడం సిగ్గుచేటు చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విద్యాసంస్థలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అక్రమాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో PDSO, DSF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DSF నాయకులు జైకృష్ణ, మహేష్, కిరణ్, PDSO నాయకులు హరి, మోహన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :