Saturday, 19 September 2026 07:25:01 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

హత్య కేసులో నలుగురు ముద్దాయిల అరెస్టు – కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్..

Date : 28 February 2026 10:53 AM Views : 154

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. Cr.No.10/2026 U/s 103 (1), 118 (1), 351 (2) r/w 3 (5) BNS & Sec 3 (2) (v) of SC/ST (POA) Act ప్రకారం కేసు నమోదు చేయబడింది. పిర్యాది: అమరచింతల మారుతి (29 సం.), తండ్రి కర్రెన్న, ఖండేరి వీధి, కర్నూలు. మృతుడు: అమరచింతల మనోహర్ (40 సం.), తండ్రి కర్రెన్న, ఖండేరి వీధి, కర్నూలు. ముద్దాయిలు: తెలుగు నగేష్ (24 సం.), బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూలు తెలుగు రాజు (36 సం.), బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూలు ఎరుకలి రాముడు @ మూగేన్న (46 సం.), ఖండేరి వీధి, కర్నూలు తెలుగు ఈరన్న (47 సం.), బండిమెట్ట, ఓల్డ్ టౌన్, కర్నూలు సంఘటన వివరాలు: 22.02.2026 రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో పాత బస్ స్టాండ్ సమీపంలోని అనిల్ బార్ వద్ద పిర్యాది మారుతి బాబాయి విజయ్ మరియు ముద్దాయిలు మద్యం సేవిస్తూ ఉండగా, మద్యం తీసుకురావాలని చెప్పిన విషయంలో వివాదం ఏర్పడింది. ఆ గొడవ మరింత తీవ్రమై, ముద్దాయిలు నలుగురు ఖండేరి ప్రాంతంలోని ఐటీఐ కాలేజీ సమీపానికి ఆటోలో వెళ్లి పిర్యాది మరియు అతని బాబాయి విజయ్‌పై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడు అమరచింతల మనోహర్ అక్కడికి చేరుకోగా, ముద్దాయిలు అతనిపై కత్తులు, కర్రలతో దాడి చేసి, ఎడమ వైపు మెడపై కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో కిందపడిన మనోహర్‌ను బంధువులు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH)కు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పిర్యాది మారుతికి కూడా గాయాలు అయ్యాయి. అరెస్ట్ వివరాలు: కేసు దర్యాప్తులో భాగంగా 25.02.2026 సాయంత్రం 6:40 గంటలకు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో, వన్ టౌన్ సీఐ పార్థసారథి, ఎస్సై చంద్ర, ఎస్సై ఖాన్ మరియు పోలీసు సిబ్బంది జోహారాపురం కరెంట్ సబ్‌స్టేషన్ సమీపంలో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ముద్దాయిల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఒక ఆటో రక్తపు మరకలతో ఉన్న రెండు కత్తులు ఒక పంచ్ (నకులు) సీజ్ చేయబడినవి. అరెస్ట్ అనంతరం ముద్దాయిలను న్యాయస్థానం ముందు హాజరు పరచడమైనది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: