Friday, 18 September 2026 04:47:09 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI..

Date : 21 April 2026 09:43 AM Views : 106

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో నిర్మాణం పూర్తయిన ఉర్దూ గర్ల్స్ కాలేజీని ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలేజీ భవనం పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ వినియోగంలోకి తీసుకురాకపోవడంతో మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయని SDPI పేర్కొంది. తలుపులు, కిటికీలు, లైట్లు వంటి సౌకర్యాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల 15 రోజుల క్రితం SDPI ప్రతినిధి బృందం కాలేజీ ప్రాంగణాన్ని సందర్శించగా భద్రత పూర్తిగా లేనట్టు గుర్తించిందని తెలిపింది. కాలేజీ ప్రాంగణంలో మద్యం సీసాలు కనిపించడం, ఆస్తి నష్టం జరగడం వంటి ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించింది. అదే విధంగా, సుమారు 100 మంది విద్యార్థులు కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించి తమ సమస్యలను తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీ ప్రారంభం కాకపోతే దాదాపు 200 మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన బాలికల విద్యకు పెద్ద ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం బోధన సిబ్బంది నియామకం లేకపోవడం వల్ల కాలేజీ ప్రారంభం ఆలస్యం కావడం అన్యాయమని SDPI విమర్శించింది. SDPI, ఆదోని డిమాండ్లు: ఈ విద్యా సంవత్సరంలోనే ఉర్దూ గర్ల్స్ కాలేజీని తక్షణమే ప్రారంభించాలి కాలేజీ ఆస్తులను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి అదనపు సూచనలు: వెంటనే వాచ్‌మన్‌ను నియమించాలి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి కాలేజీ చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించాలి ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని SDPI కోరింది. అలాగే జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని SDPI, ఆదోని డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :