Saturday, 19 September 2026 08:36:02 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

మంత్రాలయంలో కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు..

Date : 23 February 2026 05:56 PM Views : 150

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామి కు సోమవారం మంత్రాలయంలో నాయకులు, మఠం పెద్దలు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని మంత్రి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గురు వైభవోత్సవాల సందర్భంగా ఆదివారం మంత్రాలయానికి విచ్చేసిన ఆయన ఉత్సవాలలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆదివారం రాత్రి మంత్రాలయంలో బస చేసిన మంత్రి, సోమవారం గురు వైభవోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థ స్వామి శేషవస్త్రం కప్పి ఫలమంత్రాక్షతలు, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. శ్రీమఠంలో జరిగిన కార్యక్రమాలు భక్తి భావనతో కొనసాగాయి. మంత్రాలయ పుణ్యక్షేత్ర మహిమను మంత్రి కొనియాడుతూ, దేశ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకున్న మంత్రిని అధికారులు, ప్రజాప్రతినిధులు, మఠం పెద్దలు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, తహసీల్దార్ రమాదేవి, మఠం పెద్దలు, నాయకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :