DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నిందితుల నుంచి రూ.6.72 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ బెట్టింగ్ ముఠాకు నెల్లూరు, ప్రకాశం, బెంగళూరు, గోవా ప్రాంతాలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
Admin
DNB News