Friday, 18 September 2026 05:12:42 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఉద్యమ గాయకుడు మేలన్న కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం – ఆదోని జిల్లా ప్రకటించాలని జేఏసీ డిమాండ్

Date : 04 March 2026 10:24 AM Views : 123

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఉద్యమ గాయకుడు మేలన్న అకాల మరణం పట్ల ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన గానంతో ప్రజల్లో చైతన్యం నింపిన మేలన్న గుండెపోటుతో మరణించడం ఉద్యమానికి తీరని లోటుగా మిగిలిందని నాయకులు పేర్కొన్నారు. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 108వ రిలే నిరాహార దీక్ష సందర్భంగా మేలన్న కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి మృతదేహానికి నివాళులు అర్పించారు. అలాగే ప్రభుత్వం మేలన్న కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేసింది. కర్నూలు పశ్చిమ ప్రాంతమైన ఆదోని ప్రాంతంలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్యసేవలు అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హోసూరు గ్రామానికి చెందిన వ్యక్తి అత్యవసర చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పటికీ తగిన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఖరీదైన ఇంజక్షన్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా కర్నూలుకు రిఫర్ చేయడం సరైంది కాదని విమర్శించారు. ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ప్రాంతాలను కేంద్రంగా తీసుకుని ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంగా మారితే నాణ్యమైన వైద్యం, ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పడి వలసలు తగ్గుతాయని జేఏసీ నాయకులు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఆదోని జిల్లాను ప్రకటించాలని, లేకపోతే ప్రజల్లో ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బూదెప్ప, రామాంజనేయులు, పి.ఎస్. వీరేష్, కుమార్ (వైఎస్సార్ నగర్), వీరేష్ దత్తు తదితరులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అలాగే జేఏసీ నాయకులు టీ. వీరేష్, పగడాల కోదండ, వైపి నాగరాజు, గోవిందు, బండారి హనుమంతు, గుమ్మాల బాలస్వామి, రామచంద్రయ్య, సుభాష్ చంద్రబోస్, సుజ్ఞానమ్మ, జగన్, మలిగే రామలింగయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: