Tuesday, 03 November 2026 08:03:45 AM
# ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!!

సమాజం ముందున్న సవాళ్లు ఇవే: ఖమ్మంలో డీజీపీ శివధర్ రెడ్డి

Date : 03 March 2026 01:08 PM Views : 141

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఖమ్మం: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల మరణాలు, మాదకద్రవ్యాలే ఇప్పుడు తెలంగాణ సమాజం ముందున్న పెనుసవాళ్లని డీజీపీ బి. శివధర్ రెడ్డి అన్నారు. వీటి నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ), ఈగల్ దేశంలోనే అత్యున్నతంగా పనిచేస్తున్నాయని కితాబునిచ్చారు. డ్రగ్స్ ముఠాలు తెలంగాణ నుండి వెళ్లిపోయేలా చేయడంలో ఈగల్ కీలకంగా వ్యవహరించిందన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను ప్రారంభించారు. అనంతరం పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నేర గణాంకాలు, ముఖ్య కేసుల దర్యాప్తు పురోగతి, శాంతి భద్రతా చర్యలు, మహిళలు, శిశువుల భద్రత, సైబర్ నేరాల, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణాపై చేపడుతున్న చర్యలు, పలు అంశాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలోనూ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ముందువరుసలో ఉన్నామన్నారు. అయితే పదేళ్లుగా సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, ఇది సాధారణ సమస్య కాదన్నారు. స్వీయ అవగాహనతోనే సైబర్ మోసాలకు కళ్లెం వేసేందుకు ఇంటి గుమ్మం వద్దకు ప్రచారాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ రూపొందించిన ‘సైబర్ సింబా’ కార్యక్రమం జిల్లాలో అమలు చేయడం ద్వారా సైబర్ నేరాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తీవ్ర సమస్యగా మారుతోందని, రోడ్డు ప్రమాదాల విషయంలో దారుణమైన రికార్డులు నమోదు అవుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యువత మరణిస్తున్నారని, ఇది తీవ్ర ఆందోళనకరమైన సమస్యగా చెప్పారు. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తులు సురక్షితంగా ఇంటికి చేరాలని లక్ష్యంతో చేపట్టిన అరైవ్ అలైన్ కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని డీజీపీ సూచించారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలపై సీరియస్ దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల సమన్వయంతో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సంకల్పంతో మార్చి 25 నుండి 31 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తునట్లు తెలిపారు. మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలపై తనిఖీలు, నిఘా పెరగటంతో ముఠాలు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. బేసిక్ పోలీసింగ్, చట్టాలపై లోతైన అవగాహన కోసం దృష్టి పెట్టాలన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలన్నారు. తద్వారా ప్రజలకు వేగంగా న్యాయం అందించేలా పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి సారించాలన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్బంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డి ముందుగా సాయిధ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతంపలికారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, పోలీస్ ఫ్యామిలీ గృహ భవనాలను పరిశీలించారు. టెన్నిస్, పికిల్ బాల్, షటిల్ కోర్ట్, నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా పోలీస్ సిబ్బంది, పోలీస్ పిల్లలను ఉత్తమ క్రీడాకారులను చేయడం లక్ష్యంగా నిర్మితమవుతుందని అన్నారు. అదేవిదంగా నిత్యం విధినిర్వహణలో ఉండే తెలంగాణ పోలీస్ సిబ్బంది కుటుంబాలకు మెరుగైన వసతి కల్పించడం ద్వారా పోలీస్ సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరచే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను నిర్మించామని డీపీజీ ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా నేర ధోరణులు, పెండింగ్ కేసుల స్థితి, ముఖ్య విచారణల పురోగతి, నేర నియంత్రణకు అమలు చేస్తున్న ప్రత్యేక చర్యల వివరాలు డీజీపీకి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, సారంగపాణి, శ్రీనివాసులు, మహేష్, సర్వర్, సత్యనారాయణ, ఫణిందర్, సుశీల్ సింగ్, నర్సయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: