DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి బడుగు బలహీన వర్గాల ఆదర్శ ఆశ జ్యోతి మహిళల జీవితాల్లో విద్యా ప్రాముఖ్యతను సమాజానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే యొక్క 199వ జయంతి సందర్భంగా రొంపిచర్ల స్థానిక MPPస్కూల్ నందు BC సంఘం &NGO's ఆధ్వర్యంలో HM రెడ్డి రమేష్ అధ్యక్షతన జ్యోతిరావు పూలే యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా MEO శ్రీనివాసులు,విద్యావేత్త డాక్టర్ టి రఘునాథ్, జాతీయ బీసీసంక్షేమ సంఘం రాయలసీమజిల్లాల అధికార ప్రతినిధి బంగారు నారాయణ స్వామి, Dr. GVS బాబు (GVS సంస్థ అధ్యక్షులు) సంయుక్తంగా మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన పూలే గారు బాల్యం నుంచి ఆనాటి సాంఘిక దురాచారాలు కట్టుబాట్లు మధ్య వారి జీవితం కొనసాగింది. విద్యాభ్యాసం లోను వివక్షను ఎదుర్కొన్నారు. అయితే ఆంగ్లో- స్కాటిష్ అనే క్రైస్తవ మిషనరీ పాఠశాలలో విద్య ప్రారంభించారు. అక్కడే సమానత్వం అనే భావనతో అనేక ఆలోచనలతో పరిపక్వత చెందుతూ చదువు కేవలం ధనికులకు, బ్రాహ్మణులకు మాత్రమే అన్న సమాజ బ్రాంతిని తొలగించాలని ఆశయం అక్కడ మొదలై విద్యను అణగారిన వర్గాల కు అందించాలని మానవతా సంకల్పం ఆయనను కదిలించింది. 1840లో సావిత్రిబాయి పూలేను వివాహమాడి స్త్రీలను విద్యావంతులను చేయడానికి భార్యకు చదువు చెప్పించి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది 1848లో పూణేలో తొలి బాలిక పాఠశాల స్థాపించి విద్య అందరికీ అనే నినాదం కార్యరూపం దాల్చేలా చేసి, ఇది కేవలం విద్యా కేంద్రం కాదు సామాజిక మార్పు కేంద్రం అని సూచించారు. 1873లో "సత్యశోధక సమాజం" స్థాపించి దాని ద్వారా కుల వ్యవస్థను వ్యతిరేకించి శూద్ర అతి సూద్ర వర్గాలకు ఆత్మగౌరవాన్ని నూరిపోసి వివాహ పూజా విధులలో స్వతంత్రమైన ఆలోచనలను కలిగి ముందుకు సాగేలా చేశారు
Admin
DNB News