Tuesday, 04 August 2026 01:02:24 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆమదాలవలస నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

Date : 18 February 2026 10:58 AM Views : 123

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కొల్లివలసలో 2 కోట్లు 80 లక్షల రూపాయలుతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన *ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆమదాలవలస నియోజకవర్గ అభివృద్ధికి మరొక కీలక అడుగు పడింది. బూర్జ మండలంలోని కొల్లివలస గ్రామం నుండి వయా గుత్తవిల్లి ఆముదాలవలస మండలంలోని అక్కులపేట గ్రామం వరకు నిర్మించబోయే బీటీ రహదారికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా చేశారు ఈ కార్యక్రమానికి ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ రహదారుల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. కొల్లివలస – అక్కులపేట మధ్య బీటీ రహదారి నిర్మాణం వల్ల రెండు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు సులభంగా ప్రయాణించగలరని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణం వలన ఈ ప్రాంత రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు త్వరగా సులభంగా తరలించగలరని, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుకోవడం సులభమవుతుందని అన్నారు. గ్రామాల మధ్య అనుసంధానం బలపడటంతో అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అక్షరాలా నెరవేర్చే దిశగా తాము కృషి చేస్తున్నామని, ఆమదాలవలస నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని కూన రవికుమార్ గారు పేర్కొన్నారు. ప్రజల సహకారం, ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: