Saturday, 01 August 2026 11:34:21 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

పార్టీ బలోపేతానికి కేడర్ సిద్ధం కావాలి : ఎమ్మెల్సీ బీటీ నాయుడు..

Date : 16 May 2026 10:23 AM Views : 114

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో యూనిట్ ఇంచార్జీలకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బీటీ నాయుడు పార్టీ బలోపేతమే లక్ష్యంగా కేడర్‌కు దిశానిర్దేశం చేస్తూ నూతనోత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజాసేవే ప్రధాన ధ్యేయంగా కొనసాగుతోందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, చరిత్ర, సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి యూనిట్ ఇంచార్జి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొన్న బీటీ నాయుడు, నాయకత్వం సూచించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యూనిట్ ఇంచార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :