Wednesday, 16 September 2026 01:01:10 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ డా. ఏ. సిరి..

Date : 20 March 2026 11:07 AM Views : 115

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాది ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు:- పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర మాసంలో నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ, అల్లాహ్‌ను ఆరాధించిన ముస్లిం సోదర సోదరీమణులందరికీ కలెక్టర్ డా. ఏ. సిరి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికత, సేవా భావం వంటి విలువలను పెంపొందించే పవిత్ర రంజాన్ మాసం ప్రత్యేకతను కొనియాడారు. ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు, చెడును త్యజించడం వంటి సత్కార్యాల ద్వారా ఆధ్యాత్మికతను పెంపొందించే ఈ పర్వదినాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అల్లాహ్ కృపతో జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :