DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలో ఎన్డీఏ కూటమిని విడగొట్టేందుకు వైఎస్సార్సీపీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. సోషల్ మీడియాలో మాట్లాడిన జనసేన కార్యకర్త సాయికుమార్‌ను స్వయంగా కలిసిన ఆయన, జనసేన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ఇంకా 25 సంవత్సరాలు కొనసాగాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని చెప్పారు. ఆదోనిలో కూటమి ఐక్యంగా ఉన్నంతకాలం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కాలేరని ఆయన విమర్శించారు.
Admin
DNB News