DNB News - ఆంధ్రప్రదేశ్ / : తలశిల చంద్రశేఖర్ మరణం పట్ల తమ్మినేని సీతారాం ప్రగాఢ సానుభూతి విజయవాడ,ఫిబ్రవరి 23: వైసిపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాల నిర్వహణ రూపకర్త తలశిల రఘురామ్ తండ్రి తలశిల చంద్రశేఖర్ ఇటీవల పరమపదించిన విషయం విధితమే.ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడ లో రఘురామ్ నివాసానికి వెళ్లిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. దివంగత చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాల అర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రఘురామ్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా నిలబడాలని ఆత్మస్థైర్యం నింపే మాటలు చెప్పారు. కుటుంబానికి ఎదురైన ఈ అపార లోటును భర్తీ చేయలేనిదేనని పేర్కొంటూ, ఇలాంటి కష్టకాలంలో అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు. తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుంపల రామారావు సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి రాష్ట్రా ఇంటలెక్చువల్ కార్యదర్శి పిల్లల రామకృష్ణ కొత్తూరు మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ తదితరులు పాల్గున్నారు
Admin
DNB News