DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కర్నూలు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన సూచనలు చేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో నేర నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో జీవించాలని, నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజల సహకారం అవసరమని పోలీసులు కోరారు.
Admin
DNB News