Saturday, 01 August 2026 11:20:24 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

విశాఖ భూ దోపిడీపై వైఎస్సార్‌సీపీ సమరభేరి: గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన దీక్ష

Date : 30 January 2026 03:45 PM Views : 127

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖపట్నం:* గీతం యూనివర్సిటీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కట్టబెట్టాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖలో భారీ నిరసన చేపట్టింది. జీవీఎంసీ (GVMC) గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ నిరసన దీక్షను శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పూలమాలలు వేసి అధికారికంగా ప్రారంభించారు.. ఈ నిరసన దీక్షలో విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మరియు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, ధర్మశ్రీ, పసుపులేటి బాలరాజు మరియు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ మేయర్ హరి వెంకట్ కుమారి, కార్పొరేటర్లు, పాల్గొన్నారు. అడ్డగోలు క్రమబద్ధీకరణ: సుమారు ₹5,000 కోట్ల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థకు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంపై నిఘా: నేడు జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ భూ కేటాయింపులను అడ్డదారిలో ఆమోదించే ప్రక్రియను పార్టీ పరంగా తీవ్రంగా అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది. ఎంపీ అరెస్టుకు డిమాండ్: భూకబ్జాకు పాల్పడిన ఎంపీ ఎం.శ్రీభరత్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులు రద్దు చేసే వరకు మరియు విశాఖ భూములకు రక్షణ కల్పించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపబోదని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఇ.సి సభ్యులు,ఎస్.ఇ.సి సభ్యులు,రాష్ట్ర పార్టీ కమిటి అధికార ప్రతినిధిలు, సంయుక్త కార్యదర్శులు,రాష్ట్ర పార్టీ అనుబందం విభాగలు అధ్యక్షులు,కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు,జడ్పిటిసిలు,ఎంపీటీసీలు, అనుబందం విభాగాల జిల్లా, నియోజకవర్గం, మండలం మరియు వార్డుల అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :