Saturday, 19 September 2026 05:18:46 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

“మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు..

Date : 16 April 2026 06:16 PM Views : 88

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా... మహిళలపై నేరాల నివారణకు అవగాహన కల్పించేందుకు “మీ రక్షణ – మా బాధ్యత” పేరుతో కర్నూలు మెడికల్ కళాశాల ఆడిటోరియంలో గురువారం అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. సమస్యల విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలు తగ్గుతాయని అన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 112, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలు, పట్టణాలు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మహిళలతో పాటు యువతకు కూడా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి కార్యకలాపాలపై నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డా. శ్రీరాములు మాట్లాడుతూ అత్యవసర సమయంలో శక్తి యాప్ వినియోగించుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రిటైర్డ్ ఐసీడీఎస్ అధికారి జుబేదా బేగం మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు మంచి విలువలు నేర్పించాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ గారు మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, డాక్టర్లను శాలువా, మెమొంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, వైస్ ప్రిన్సిపల్స్ డా. శ్రీరాములు, డా. సింధియా శుభప్రద, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డా. మాధవి శ్యామల, ఐసీడీఎస్ నుండి అనురాధ, అడ్వకేట్ నాగలక్ష్మి, సీఐలు మధుసూదన్ రావు, రామయ్య నాయుడు, శేషయ్య, శివశంకర్, విక్రమ సింహ, మన్సురుద్దీన్, మారుతి శంకర్, శ్రీధర్ మరియు మహిళా శక్తి టీం పోలీసులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: