DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో తుంగభద్ర కాలువ నుంచి మరో మూడు రోజుల్లో నీరు రానున్న నేపథ్యంలో, ఈ రోజు బసాపురం ఎస్‌ఎస్ ట్యాంక్ మరియు కాలువను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన ఆమె, అవసరమైన మరమ్మత్తులను తక్షణమే చేపట్టి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో LLC చైర్మన్ బసాపురం రామస్వామి, మాజీ MPP మురళి, వడ్డేమాన్ గోపాల్, కల్లుబావి మల్లి, బైచిగేరి ఓంకార్, సాదిక్ వలి, రాఘవరెడ్డి, రాజశేఖర్, దేవేంద్ర, చిన్న చిట్టి, భరత్, బాబురావు, వీరేష్, కుప్పగళ్ళు హనుమంతు మరియు గ్రామ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News