Saturday, 19 September 2026 10:27:50 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి

Date : 28 January 2026 12:04 PM Views : 141

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న నిరంతర పోరాటంలో భాగంగా, 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని IFTU (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు) పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా IFTU కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి IFTU జిల్లా కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ, పారిశ్రామిక విప్లవం నాటి నుంచి కార్మిక వర్గం 8 గంటల పని దినం వంటి హక్కులను సాధించేందుకు ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. జైలు జీవితాలు, నిర్బంధాలు, ఉరికంబాలు ఎక్కిన చరిత్ర కార్మిక ఉద్యమానికి ఉందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలతో వచ్చినవి కావని, కార్మిక వర్గం చేసిన దీర్ఘకాలిక, అలుపెరుగని పోరాటాల ఫలితమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్లమెంటరీ బలంతో నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఆమోదించిందని, కరోనా లాక్‌డౌన్ సమయంలో మూడు కోడ్లను ఆమోదించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. గత ఆరు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండటంతో అవి అమల్లోకి రాలేదని, అయితే 2025 నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం మరో వారంలోనే నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తామని ప్రకటించిందన్నారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలో, 2026 ఏప్రిల్ నుంచి ఈ కోడ్లను అమల్లోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులు, భద్రత, జీవనోపాధిని కాపాడుకోవాలంటే ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సమష్టిగా విజయవంతం చేయాలని వెంకటప్ప పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొట్టాల మల్లికార్జున, శ్రీరాములు, ఖాదర్, బాబు, రూబెన్ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :