Wednesday, 17 June 2026 05:13:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

తిరుపతి జిల్లా, సత్యవేడు,శ్రీసిటీలో క్యారియర్‌ ఏసీ కంపెనీకి లోకేష్ శంకుస్థాపన

Date : 06 May 2026 05:03 PM Views : 35

DNB News - ఆంధ్రప్రదేశ్ / : - శ్రీసిటీ కేవలం ఒక పారిశ్రామిక పార్క్ కాదు, గ్లోబల్ తయారీ కేంద్రం - 2028 నాటికి 80 శాతం ఏసీలు ఏపీ నుంచే తయారీ - ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించిన మంత్రి లోకేష్ ప్రపంచ ప్రఖ్యాత క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ & రెఫ్రిజిరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో నూతన తయారీ కేంద్ర నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో క్యారియర్‌కు తొలి తయారీ యూనిట్‌ కానుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, మానవ వనరుల శాఖ నారా లోకేష్ ముఖ్య అతిధిగా ఈ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్యారియర్ గ్లోబల్ యాజమాన్య ప్రతినిధులు డేవిడ్ ఎల్ గిట్లిన్, మైఖేల్ ఎల్ గియర్జెస్, సుందరేశన్ నారాయణన్‌, శ్రీసిటీ ప్రతినిధులు శ్రీని రాజు, డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత చురుకైన పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లలో ఒకటైన శ్రీసిటీలో నేడు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా ఉందన్నారు. ఈ రోజు కేవలం ఒక ప్రాజెక్టును ప్రారంభించడం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్ మరియు AI అభివృద్ధి యొక్క తదుపరి అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. క్యారియర్ సంస్థ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, క్యారియర్ కేవలం ఒక కంపెనీ కాదు, ప్రపంచం శీతలీకరణ ఆలోచన విధానాన్ని మార్చిన పయనీర్ సంస్థగా అభివర్ణించారు.నా మొదటి ఎయిర్ కండిషనర్ కూడా క్యారియర్‌దే. కాబట్టి ఇది కేవలం వ్యాపార సంబంధం కాదు, ప్రత్యేకమైన అనుబంధం. మోడ్రన్ ఎయిర్ కండిషనింగ్‌ను కనిపెట్టడం నుండి $50 బిలియన్ గ్లోబల్ సంస్థగా ఎదగడం వరకు క్యారియర్ ఎప్పుడూ ఆవిష్కరణలో ముందంజలో ఉంది. ఇప్పుడు ఆ ఆవిష్కరణ మన రాష్ట్రానికి వస్తోంది. దీని ద్వారా ₹1000 కోట్ల పెట్టుబడి సుమారు 3,000 స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది మన రాష్ట్రం, మన ఎకోసిస్టమ్ మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై నమ్మకానికి నిదర్శనం" అని మంత్రి వ్యాఖ్యానించారు.శ్రీసిటీ కేవలం ఒక పారిశ్రామిక పార్క్ కాదు, గ్లోబల్ తయారీ కేంద్రం. 8,500 ఎకరాల విస్తీర్ణంలో 31 దేశాలకు చెందిన 250 కంపెనీలు ఉన్నాయి. $6 బిలియన్ ఎగుమతులు, 70,000 ఉద్యోగాలు, అందులో 50% మహిళలకు చెందడం విశేషం. ఆటోమోటివ్ నుండి ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ నుండి ఇంజనీరింగ్ వరకు వేదిక అయిన శ్రీసిటీ “మేక్ ఇన్ ఇండియా” మరియు “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్”కు ప్రతీక. ఉద్యోగుల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతంగా వున్న శ్రీసిటీ “స్త్రీ సిటీ”గా కూడా గుర్తింపు పొందుతోంది" అని లోకేష్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే “కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందింది. 9 ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు, 30+ సరఫరా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. 2027 నాటికి భారతదేశంకు అవసరమైన 60% ఏసీలు, 2028 నాటికి 80% ఇక్కడే తయారు అవుతాయని ఆశిస్తున్నాం అని ఆయన చెప్పారు.అలాగే, క్యారియర్ మన రాష్ట్రాన్ని ఎంచుకోవడానికి యువ మరియు ఉత్సాహభరిత నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర-రాష్ట్ర సమన్వయం (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) మూడు ప్రధాన కారణాలుగా వెల్లడించారు. క్యారియర్ కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. త్వరలో యువత కోసం AI ఆధారిత స్కిల్లింగ్ ప్లాట్‌ఫారమ్ (నైపుణ్యాభివృద్ధి) “మైక్రోనెట్” ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.క్యారియర్ గ్లోబల్ చైర్మన్ & సీఈఓ డేవిడ్ ఎల్ గిట్లిన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ క్యారియర్ భారత ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. 100 మిలియన్ డాలర్ల ఈ పెట్టుబడి ద్వారా ఆవిష్కరణలు, సుస్థిరత, స్థానిక ప్రతిభాభివృద్ధికి తమ కట్టుబాటును చాటుతున్నామని అన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :