Saturday, 19 September 2026 09:12:21 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

రంజాన్ సందర్భంగా హోం గార్డులకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేసిన కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్..

Date : 17 March 2026 03:35 PM Views : 101

DNB News - ఆంధ్రప్రదేశ్ / : పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని 100 మంది హోమ్ గార్డులకు బియ్యం ప్యాకెట్లను కర్నూలు డీఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ పంపిణీ చేశారు. సోమవారం కర్నూలు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ తబ్రేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాబు ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై హోమ్ గార్డులకు బియ్యం ప్యాకెట్లు అందజేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతున్న మహేశ్వర్ రెడ్డి, ఈదుల దేవర బండ సుభాన్, క్వాలిటీ టైల్స్ రఫీ, మదీనా స్వీట్స్ రహమతుల్లాలను డీఎస్పీ శాలువాలతో సత్కరించి వారి సేవా భావాన్ని అభినందించారు. అనంతరం మౌలానా సలామ్ ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించి అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉంటూనే ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డులను అభినందించారు. పోలీసు శాఖ హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ నేర్పే క్రమశిక్షణ, త్యాగం మరియు సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండి శాంతియుత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: