DNB News - ఆంధ్రప్రదేశ్ / : * పాతపట్నం నియోజకవర్గం లో గ్రామ సర్పంచులు గా తమ ఐదేళ్ల పదవి కాలాన్ని అత్యంత సమర్ధవంతం గా, నిబద్ధతతో పూర్తి చేసినందుకు ఈ రోజు పాతపట్నం నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటి సభ్యులు రెడ్డి శాంతి గారు ఆత్మీయ సమ్మేళనం & సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ మరియు ప్రస్తుత వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)దుంపల రామారావు (లక్ష్మణ రావు) పాల్గొన్నారు . ఈ సమావేశం లో రెడ్డి శాంతి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021 లో స్థానిక సంస్థల ఎన్నికలను నియోజక వర్గం పరిధిలో పారదర్శకంగా నిర్వహించడం ఆ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో సర్పంచ్ లగా పదవీ బాధ్యతలు చేపట్టారని తమ బాధ్యతలను సమర్ధవంతంగా బాధ్యతగా పంచాయతీలను అభివృద్ధి పథం లో నడిపించి ప్రజా మన్ననలు పొందడం అభినందించదగిన విషయం అని అన్నారు.రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుకొని 2029 లో మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చేయడం మన అందరి బుజస్కందాలుపై ఉండాలని అన్నారు . అనంతరం సర్పంచ్ లకు పూలమాలలు వేసి దుస్సాలువ తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.
Admin
DNB News