DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ వినియోగించే ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేసి, వాటి వినియోగం మరియు ప్రాధాన్యతపై విద్యార్థులకు వివరించారు. అలాగే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కూడా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై కూడా అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు, శక్తి యాప్, శక్తి టీమ్ వాట్సాప్ నంబర్ 7993485111, పోలీసు హెల్ప్‌లైన్ 112, మహిళల భద్రత హెల్ప్‌లైన్ 181, చైల్డ్ లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 గురించి విద్యార్థులకు వివరించారు. డాగ్ స్క్వాడ్ బృందాల పనితీరు, బైనాక్యులర్ వినియోగం గురించి ప్రదర్శన ద్వారా తెలియజేశారు. అనంతరం విద్యార్థులు పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను సందర్శించి, పోలీస్ విధుల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ విజయలక్ష్మి, ఆర్‌ఐ జావేద్, ఎస్సైలు శ్రీనివాస్, గోపినాథ్, తిమ్మయ్య, ఎన్‌సీసీ విద్యార్థులు, నారాయణ, సిరాక్, సర్వేపల్లి రాధాకృష్ణ పాఠశాలల విద్యార్థులు, విద్యార్థినిలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News