DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మూడో రోజు కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అడిషనల్ ఎస్పీ జయశర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
Admin
DNB News