Wednesday, 17 June 2026 05:13:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

జిల్లా టిడిపి కార్యాలయంపై వైసీపీ అసత్య ప్రచారం మానుకోవాలి : గుడిసె ఆది కృష్ణమ్మ..

Date : 08 May 2026 11:11 AM Views : 34

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా టిడిపి కార్యాలయం నిర్మాణంపై వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని జిల్లా టిడిపి అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ సూచించారు. టిడిపి శాశ్వత భవనం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించామని తెలిపారు. అయితే ఆ కార్యక్రమంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్య ప్రచారమేనని మండిపడ్డారు. గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ.. టిడిపిపై విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు అలవాటైపోయిందన్నారు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “రెండు ఎకరాల స్థలంలో టిడిపి కార్యాలయం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు” అని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అది రెండు ఎకరాలు కాదని, ఒకటిన్నర ఎకరాల స్థలం మాత్రమేనని తెలిపారు. ఆర్ & బి క్వార్టర్స్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలని ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఇది కొత్త అంశం కాదని, గత పది సంవత్సరాలుగా పార్టీ పెద్దలు, అప్పటి జిల్లా అధ్యక్షులు, నాయకులు ఈ స్థలం కోసం ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ పార్టీకి శాశ్వత కార్యాలయం అవసరమనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం కొనసాగుతోందన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. టిడిపి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. “వందేళ్లు దాటిన చెట్లను తొలగించి పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నారు” అనే వ్యాఖ్యలపై కూడా స్పందించిన ఆయన, అది పూర్తిగా అసత్యమన్నారు. తమ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అభివృద్ధి మరియు ప్రకృతి మధ్య సమతౌల్యం పాటిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వత పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని రాజకీయ విమర్శల కోసం వక్రీకరించడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు.. ఎవరు కేవలం అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :