DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో నిర్వహిస్తున్న “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్” కు హాజరవుతున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఆదోని నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆదోని టిడిపి ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కె. మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు కె. ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో సుమారు 150 మంది ముస్లిం విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేక బస్సులు మరియు భోజన వసతులను కల్పించారు. ఈ సందర్భంగా యువ నాయకులు శ్రీ కొంకా సిద్ధార్థ నాయుడు మైనారిటీ నాయకులతో కలిసి విద్యార్థులకు ఘనంగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభ్యున్నతి, విద్యా పురోగతి మరియు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మైనారిటీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News