Wednesday, 04 November 2026 01:23:33 PM
# ఆదోనిలో స్వప్న నాయకర్ సంచలన విజయం.. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు షాక్.. # చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన కేసులో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!! # దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!!

ఇంటికన్నపు దొంగలు అరెస్ట్ – హైదరాబాద్ నిందితుల నుంచి 7 తులాల బంగారం స్వాధీనం...

Date : 13 February 2026 11:21 AM Views : 176

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు పట్టణంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేటువంటి మద్దిలేటి అను అతని ఇంటిలో జనవరి 29వ తారీఖున పగలు సుమారు 12 గంటల ప్రాంతం లో ఇంటికన్నం దొంగతనం జరిగింది. అందులో సుమారు 13 తులాల బంగారు ఆభరణాలని దొంగతనం చేసి ఇంట్లో నుండి బయటికి వచ్చే క్రమంలో గమనించి అడ్డొచ్చిన మద్దిలేటి భార్య లక్ష్మీదేవి, ఆమె కూతురిని గట్టిగా నెట్టేసి మోటార్ సైకిల్ లో పారిపోయినట్టు వచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకొని ఫిర్యాది భార్య కి గాయమైనదని, ఎట్టి పరిస్థితులలో కేసును చేధిoచాలనీ, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పి శ్రీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో 4 టౌన్ ఇన్స్పెక్టర్ విక్రమ సింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ మురళీధర్ మరియు లక్ష్మీనారాయణ ప్రత్యేక బృందంగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్ లను కర్నూలు నుంచి షాద్ నగర్ వరకు క్షుణ్ణంగా పరిశీలించి, ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సదురు సమాచారాన్ని పంచుకొని దొంగతనానికి పాల్పడిన నిందితులు మారెడ్ పల్లి బిజినమైన రఘు మరియు సికింద్రాబాద్ నివాసి అయినా టమాటార్ శివా సింగ్ గా గుర్తించి వారి యొక్క కదలకలపై నిఘా ఉంచి ఈ రోజున మునగాలపాడు గ్రామ శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపానగల బంజారా హిల్స్ వెంచర్ నందు ఉదయం సుమారు 9 గంటల కు వారిద్దరిని అరెస్టు చేసి వారి నుండి దొంగతనం చేసిన సుమారు 7 తులాల బంగారు ఆభరణాలను, నేరానికి ఉపయోగించిన TVS NTorq మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ముద్దాయి అయినటువంటి సికింద్రాబాద్కు చెందిన టమటర్ శివా సింగ్ పైన గోపాలపురం పోలీస్ స్టేషన్, తుకారాం గేట్, చిలకలగూడ, మేడిపల్లి, హయత్ నగర్, అంబర్పేట ఘట్కేసర్, జవహర్ నగర్ గాంధీనగర్, బాలనగర్ మారేడ్పల్లి సుల్తాన్ బజార్ పేట్ బషీర్బాగ్ మొదలగు పోలీస్ స్టేషన్లో 28 కి పైగా అతని మీద ఇంటికన్నపు దొంగతనాల కేసులు కలవు. అదేవిధంగా మరొక నిందితుడైన బిజినమైన రఘు పైన 15 కు పైగా దొంగతం కేసులు కలవు. 2021 వ సంవత్సరం లో శివా సింగ్ ఓనా సంవత్సరం పాటు PD ACT పై చంచలగూడ జైలు నందు ఖైదు చేయబడ్డాడు. కర్నూల్ నాలుగో పట్టణ సిఐ శ్రీ విక్రమ సింహ మాట్లాడుతూ.... బంగారు ధరలు పెరుగుతున్న దృష్ట్యా మరింత జాగ్రత్తగా ఉండాలని , దయచేసి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్ లలో భద్ర పరచుకోవాలని కర్నూల్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: