DNB News - ఆంధ్రప్రదేశ్ / : హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆదోని పట్టణంలో ఈ నెల 19న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణమంతా జయంతి వేడుకల సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖుడు చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిర్వాహకులు కునిగిరి నీలకంఠ, ఆదోని విజయ్ కృష్ణ, సాయి ప్రసాద్, వాల్మీకి అజయ్ కుమార్ తదితరులు ఈ విషయాన్ని తెలిపారు. జయంతి వేడుకల సందర్భంగా ప్రజా సేవే లక్ష్యంగా ఉచిత గుండె వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, పట్టణ పురవీధుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమితి సభ్యులు జ్ఞానేశ్వర్ రావు, శ్రీకాంత్, వాల్మీకి శివ, కాశీ విశ్వనాథ్, వాల్మీకి చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News