DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గ్రూప్-2 ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.50 లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంత్రికి గ్రామానికి చెందిన నిరుద్యోగి విశ్వనాథ్ మరియు ఆయన భార్య దానేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, కర్నూలుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గ్రూప్-2 ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి పలుమార్లు డబ్బులు తీసుకున్నారని తెలిపారు. అయితే ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు పెద్దతుంబలం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీవిద్య తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందన్నారు.
Admin
DNB News