DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పుకాపుజాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం,నూతన కార్యాచరణతో ఉద్యమనేపధ్యాన్ని తీవ్రతరం చెయ్యాలని శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు, శుక్రవారం తూర్పుకాపు సంక్షేమ సంఘము జిల్లా కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ముఖ్యఅతిధులుగా హాజరైన అలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ నేతృత్వంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమీక్షాసమావేశానికి, తూర్పుకాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కొబగాపు గౌతమ్ అధ్యక్షత వహించారు , ఈ సభలో తూర్పుకాపుజాతి అభ్యుదయం కోసం కొన్ని తీర్మాణాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానించారు,తీర్మానం:-- 1, కిరాక్ ఆర్పీ అనే ఓ వ్యక్తి, తూర్పుకాపుజాతి అభ్యుదయవాది, మాజీ మంత్రి,శాశనమండలిలో ప్లోర్ లీడర్ శ్రీ బొత్స సత్యనారాయణనివ్యక్తిగతంగా వ్యాంగ్యాంగా మాట్లాడిన విధానం,అక్షేపనీయమని తీవ్రంగా కండించారు,2,అతిత్వరలోనే శ్రీకాకుళం జిల్లా వేదికగా తూర్పుకాపుజాతి ఆత్మగౌరవ భారీ బహిరంగసభ అన్ని సంఘాలను, తూర్పుకాపుజాతిలో తాజా, మాజీ మంత్రులు, MLA లు, MP లు, MLC లను కలుపుకొనినిర్వహించాలని, 3, అన్ని నియోజకవర్గాలకు,అన్ని మండలాలకు, నూతన కార్యవర్గాను వెంటనే నియమించాలని,4 తూర్పుకావుజాతి రిజర్వేషన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ని మరో మారు కలవాలని 5,తూర్పుకాపుజాతిలో ఆపదలో ఉన్నాను, అన్యాయానికి గురౌతున్న వారిని తక్షణమే అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చెయ్యాలని సమావేశంలో తీర్మానించారు, తూర్పుకాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిధులుగా AITKSS జాతీయ గౌరవఅధ్యక్షులు పతివాడ గిరీశ్వరరావు,AITKSS జాతీయ కార్యదర్శి మామిడి విస్ట్నుమూర్తి, APTKSS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లుకలాపు సంతోష్,రాష్ట్ర కార్యదర్శి మత్స బుచ్చిబాబు,APTKSS ఉద్యోగవిభాగ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వాడవలస సురేష్ కుమార్,APTKSS యువజనవిభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి సుమన్, APTKSS మహిళావిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కీర్తి సుశీల, రాష్ట్ర ప్రధానకార్యదర్శి గొర్లె అనురాధ, రాష్ట్ర కార్యదర్శి లక్మి,, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కొబగాపు గౌతమ్,జిల్లా గౌరవఅధ్యక్షులు ముంజెటి పాపారావు, జిల్లా సహధ్యక్షులు రెడ్డి వాసుదేవరావు, జిల్లా కోఆర్డినేటర్ యాబాజీ చంద్రశేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు రౌతు చిరంజీవిరావు, గుమ్మడి శాంతారావు, రౌతు జగన్నాధరావు, జిల్లా ఉపాధ్యక్షులు,కలమట సుప్రియ రమేష్,కిల్లారి గోవిందరావు, రౌతు నారాయణరావు, జిల్లా ప్రధానకార్యదర్శిలు శైలాడ అన్నయ్యనాయుడు, వంగపల్లి లక్ష్మినారాయణ, లోలుగు సింహాచలం, జిల్లా కార్యదర్శిలు మీసాల రామారావు,సింగుపురపు రవికుమార్, బాబూరావు, జిల్లా సంయుక్తకార్యదర్శిలుగోకర్ల సునీల్, లుకలాపు సతీష్ , కరణం నాగరాజు, జిల్లా కోశాధికారి తులగాపు ధనుంజయరావు, ఇసాయి వెంకటేష్లు హాజరై పై అంశాలను ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, ,
Admin
DNB News