DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో వీఆర్వో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. వీఆర్వో బీటీ సురేష్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్నాథ్ కిడ్నాప్ చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించిన వన్‌టౌన్ పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా మధిరె శివారులోని ఎన్‌డీబీఎల్ ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించారు. అక్కడ బాధితుడు బీటీ సురేష్‌ను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందన్నారు.
Admin
DNB News