Friday, 18 September 2026 05:07:15 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

అభివృద్ధికి ,అత్యద్భుత రోడ్ల నిర్మాణానికి చిరునామాగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం--- *ఎమ్మెల్యే కూన రవికుమార్

Date : 26 January 2026 09:52 AM Views : 190

DNB News - ఆంధ్రప్రదేశ్ / : బొబ్బిలిపేట గ్రామంలో రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన గ్రామీణ మౌలిక వసతులపై కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ – ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో పలు రహదారుల నిర్మాణాలకు ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి రహదారుల నుంచే ప్రారంభమవుతుందని, ప్రతి గ్రామానికి నాణ్యమైన రహదారి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బొబ్బిలిపేట నుంచి వెదుర్లవలస వరకు రూ.1.80 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమవడమే కాకుండా, రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా, బొబ్బిలిపేట గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రూ .53 లక్షల వ్యయంతో నిర్మించిన *సిసి రోడ్లను కూడా ఆయన ఈరోజు ప్రారంభించారు . గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి అధికారులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :