DNB News - ఆంధ్రప్రదేశ్ / : కలెక్టరేట్ ఆవరణంలో విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి లోపం ఉన్న వారికి హియరింగ్ ఎయిడ్స్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వారికి అవసరమైన సహాయక పరికరాలు అందించి, స్వయం ఆధారిత జీవనం గడపడానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నామన్నారు. ట్రై సైకిళ్లు, హియరింగ్ ఎయిడ్స్ అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల శాఖ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
DNB News