DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహిళలు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ABN వేమూరి రాధకృష్ణ పై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) ఇచ్చాపురం దుంపల రామారావు (లక్ష్మణ రావు).. ABN ఆంధ్రజ్యోతి టెలివిజన్ ఛానల్‌లో ఈ నెల 4తేదీన న ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన అత్యంత అవమానకర, దూషణాత్మక, అసత్య మరియు దురుద్దేశపూర్వక వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రసారం కాగా వాటిని యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేసిన ABN రాధాకృష్ణ మరియు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దుంపల రామారావు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మహిళలకు బధ్రత గౌరవం కరువైందని , ABN రాధకృష్ణ చేసిన వ్యాఖ్యలు తో చంద్రబాబు బినామీ దారులకు పిచ్చి పరాకాష్టకు చేరిందని అన్నారు.ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను నేరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తూ అతి నీచమైన రాజకీయం చేస్తుంది అని అన్నారు .ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ABN ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ మరియు తత్సంబధిత యాంకర్, దానికి అనుమతి ఇచ్చిన ఎడిటర్ మరియు మేనేజ్‌మెంట్ ఇతర బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేసారు.
Admin
DNB News