Thursday, 17 September 2026 04:35:29 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

అంగన్వాడీ సమస్యలపై స్పందించిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ..

Date : 03 March 2026 12:54 PM Views : 129

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపడుతున్న నిరసనల నేపథ్యంలో, కర్నూలులో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ అంగన్వాడీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా AITUC ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు జానకి, రాష్ట్ర సమితి సభ్యురాలు గౌసియా, ట్రెజరర్ గీతాదేవి, ప్రభావతి, శంకరమ్మ, దేవలమ్మ, అధ్యక్షుడు టి.వీరేష్ తదితరులు ప్రధాన సమస్యలు మరియు డిమాండ్లను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నామని ఆది కృష్ణమ్మ తెలిపారు. రెండు సార్లు వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, కేంద్రాల మౌలిక సదుపాయాల మెరుగుదల, తాగునీరు–మరుగుదొడ్లు–టీవీ–ఆర్వో సదుపాయాలు, 58 వేలకుపైగా సిబ్బందికి 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ, గ్రాట్యుటీ అమలు, మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అంగన్వాడీ వర్గాల ప్రధాన డిమాండ్లలో కనీస వేతనం రూ.26,000 ఇవ్వడం, పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ కల్పించడం, గ్రాట్యుటీ అమలుకు స్పష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించడం, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయడం, హెల్పర్ల ప్రమోషన్లకు నియమావళి రూపొందించడం, నాలుగు యాప్‌ల స్థానంలో ఒకే యాప్ అమలు చేయడం, మే నెలలో వేసవి సెలవులపై వెంటనే జీఓ జారీ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :