DNB News - ఆంధ్రప్రదేశ్ / : నంద్యాలలో నిర్వహించిన లీడర్స్ కాన్క్లేవ్‌లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఆదోని యూనిట్ చురుకుగా పాల్గొంది. కార్యక్రమంలో జిల్లా, డివిజన్, ఏరియా స్థాయి నాయకులు విస్తృతంగా హాజరై పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆదోని నాయకులు చారిత్రాత్మక శాహీ జామియా మస్జిద్, ఆదోని చిత్రంతో కూడిన ప్రత్యేక ఫోటో ఫ్రేమ్‌ను SDPI జాతీయ అధ్యక్షుడు ఎం.కె. ఫైజీ కి అందజేశారు. ఈ కాన్క్లేవ్‌లో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొని పార్టీ అభివృద్ధిపై తమ సందేశాలను అందించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు పార్టీ కమిటీలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. యువత మరియు మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం ద్వారా పార్టీ ప్రభావాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు. అలాగే సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణలో SDPI పాత్రను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆదోని నుండి అడ్వకేట్ సద్దాం, టిప్పు సుల్తాన్, షరీఫ్, జీలాన్, సద్దాం, ఖాదర్ తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి మరియు భవిష్యత్ కార్యాచరణపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. – SDPI ఆదోని
Admin
DNB News