Friday, 18 September 2026 07:17:55 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు

Date : 22 April 2026 05:50 PM Views : 84

DNB News - తెలంగాణ / : ఖమ్మం నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నగరంలోని చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జ్‌ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్‌ల ప్రస్తుత పరిస్థితి, మరమ్మత్తుల అవసరం, ట్రాఫిక్ సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. చర్చికాంపౌండ్ ఓవర్ బ్రిడ్జ్‌పై ప్రయాణించే వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బ్రిడ్జ్ మధ్యభాగంలో రబ్బరు స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల ప్రయాణాన్ని సాఫీగా మార్చాలని సూచించారు. అలాగే, బ్రిడ్జ్‌పై ఉన్న గుంతలు, పగుళ్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, బ్రిడ్జ్ మీద ఉన్న పూల కుండలలో మొక్కలు సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, ప్రమాదాల సూచనలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న అన్ని పనులు నాణ్యతతో, సమయపాలనతో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను దశలవారీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: