DNB News - తెలంగాణ / : హైదరాబాద్ నగరంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. బీర్ బాటిల్‌లో చేప పిల్ల కనిపించడంతో అక్కడ కలకలం రేగింది. ఈ సంఘటన Mallapur, Hyderabad లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… మల్లాపూర్ సమీపంలోని ఓ వైన్ షాపులో ఓ వ్యక్తి బ్రాండెడ్ బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. బాటిల్ సీల్ తీయబోయే ముందు లోపల చూడగా ఏదో కదులుతున్నట్లు అనిపించింది. కాస్త నిశితంగా పరిశీలించగా బీర్‌లో చిన్న చేప పిల్ల కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆ వ్యక్తి వెంటనే బీర్ బాటిల్‌ను షాపు నిర్వాహకులకు చూపించాడు. దీంతో వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ ఉన్న ఇతర మందుబాబులు కూడా ఆసక్తిగా ఈ ఘటనను చూసి చర్చించుకున్నారు. బాటిల్ పూర్తిగా సీల్ అయి ఉన్నప్పటికీ లోపలికి చేప పిల్ల ఎలా వచ్చిందన్నది మిస్టరీగా మారింది. బీర్ల తయారీ కేంద్రంలో బాటిళ్లను శుభ్రం చేసే సమయంలో లేదా బీర్ నింపే ప్రక్రియలో తప్పిదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు బీర్ తాగే ముందు ఒక్కసారి బాటిల్ లోపల చూసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
Admin
DNB News