Saturday, 01 August 2026 07:13:13 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా.. ఆద్యంతం ఉద్వేగభరితం..

Date : 26 March 2026 10:28 AM Views : 64

DNB News - తెలంగాణ / : కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా.. ఆద్యంతం ఉద్వేగభరితం.. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ.. విధి లేని పరిస్థితిలో వీడుతున్న.. జీవన్ రెడ్డి వెంటే ఉంటామని ముక్తకంఠంతో నినదించిన అభిమానులు..కార్యకర్తలు.. కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలు.. కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు..పెట్టిన కార్యకర్తలు.. కాంగ్రెస్ కండువా వేసుకొని.. ఇందిరా భవన్ నుండి అభిమానులు, కార్యకర్తలు, నాయకుల నినాదాల మధ్య స్థానిక జంబి హనుమాన్ ఆలయం వరకు కాలినడక వెళ్ళి కొబ్బరికాయ కాయ కొట్టి, పూజలు చేసి, స్థానిక బండారి గార్డెన్ వరకు వాహనంలో తరలి వెళ్లారు. విధి లిఖితం నాలుగు దశాబ్దాల అనుబంధం వదులుకోవలని ఎవరు కోరుకోరు.. విధి లేని పరిస్థితి లో నిర్ణయం తీసుకున్న. నా ఈ స్థాయికి మిత్రులు, అభిమానులు, నాయకులు కార్యకర్తలు తోడ్పడ్డారు. 1984 లో కాంగ్రెసు పార్టీ చేరిన.. ఎన్నికల్లో గెలవడం ఓడటం సహజం.. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల ఐక్యతకు చిహ్నము. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితిలో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఐక్యత కు నిదర్శనం. 1996 శాసన సభ ఉప ఎన్నికల్లో 1 లక్ష ఓట్లు పోలైతే 54 వేల మెజార్టీ తో గెలుపొందిన. ఉప ఎన్నికల్లో 73 శాతం ఓట్లతో గెలుపొందిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కెసిఆర్ పై 2006, 2008 పార్లిమెంట్ ఉప ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు పోటీ చేసిన. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ ఎస్ గెలుపొందితే ఉత్తర తెలంగాణ జలాల్లో ఏకైక శాసన సభ్యుడిగా ఎన్నికయ్యను. ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా వినిపించాను. 2018 లో ఎమ్మెల్యేగా ఓడినా 2019 ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీగా గెలుపొందిన. శాసన మండలి లో ఏకైక సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన. కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు, ఒకటి సీ పీ ఐ 7 గురు ఎం ఐ ఎం సపోర్ట్ ఉండగా.. మెజారిటీ ఉండి కూడా బీ ఆర్ ఎస్ పార్టీ పది స్థానాల్లో ఫిరాయింపులు ప్రోత్సహించారు. దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై దౌర్జన్యం చేసిన వారిని మళ్ళీ పార్టీ లో స్థానం కల్పించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల ను దోచుకన్నారు. విధి లేని పరిస్థితిలో బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం. మీ హక్కుల కు భంగం కలుగనివ్వమని కేసి వేణుగోపాల్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల మార్కెట్ కమిటీ మారు గంగారెడ్డి, రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి నియామకంలో అందరూ ఏకాభిప్రాయం తెలిపారు. సీఏం రేవంత్ రెడ్డి ను కలసి మార్కెట్ కమిటీ చైర్మన్ ల ప్రతిపాదనలు అందజేయాగ వేం నరేంద్ర రెడ్డిని అప్పగించగా.. ఇఏమైంది అని అడిగితే నాది ఏముందీ నాది పోస్ట్ మాన్ ఉద్యోగం సి ఎం ఏది చెప్తే ఆది చేస్తా అన్నారు. సీఏం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల కోసం రెండో ప్రతిపాదన చేశారు. దశాబ్దాల తరబడి నాకు అండగా నిల్చిన నాయకుడు అతి కిరాతకంగా హత్యకు గురైతే నేను స్పందించలా వద్దా... ఓ కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నది బజారులో చంపబడితే కనీసం సి ఎం రేవంత్ రెడ్డి ఏం జరిగింది అని కూడా అడుగలేదు... నా స్థాయి ముఖ్యమంత్రి ఓదార్పు కోరునుకే స్థాయి కాదా..అని నిలదీశారు.. కార్యకర్తల శ్రమతో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. కనీసం కార్యకర్తకు అండగా నిల్వల వద్దా. ఈ బాధ జీర్ణించుకోలేక ఏ ఐ సీ సీ కి లేఖా రాసిన. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి అండగా నిలువలసిన నైతిక బాధ్యత లేదా.. మార్కెట్ కమిటీ ప్రతిపాదన నిలుపకుండా నియామకం చేపడితే బతికి ఉండేవారేమో.. గంగారెడ్డి మరణం లో నాది బాధ్యత ఉంది అని భావిస్తున్న.. రెండేళ్లు గడుస్తుంది..మార్కెట్ కమిటీ నియామకం అయితే ఒక టర్మ్ పూర్తి అయ్యేది. ఇదేమిటి కాంగ్రెస్ నా కార్యకర్తల హక్కుల అధిష్టానం సంయమనం పాటించాలి అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అడ్లూరి లక్ష్మణ్ సాక్షిగా ఉత్తర్వులు జారీ చేయమని చెప్పిన తర్వాత కూడా అమలు చేయకపోతే ఎలా కార్యకర్తలు బలి అవుతుంటే వారికి అండగా నిలవకపోతే పార్టీ లో ఏవిధముగా కొనసాగటం.. దేవాలయాల కమిటీలో,ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలో కూడా మాకు కనీసం సంచారం లేదు. బీ ఆర్ ఎస్ పాలనలో అరచకం చేసిన పోలీస్ యంత్రాంగం మళ్ళీ తీసుకువచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాది అని భావన ఉండాల వద్దా.. ఒకవైపు స్పీకర్ పరిధి లో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే ఫిరాయింపు విచారణలో ఉందా గాంధీ భవన్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహ రచన సమావేశంలో ఎమ్మెల్యే సమావేశం కావడం.. రాహుల్ గాంధీ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే నినాదంతో ముందుకు వెళ్తుంటే ఒక పార్టీ లో ఎమ్మెల్యే గా గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద పోటీ చేయడం దేనికి సంకేతం.. పార్లమెంట్ ఎన్నికల్లో సీఏం రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గంలో ఓడిపోయింది.. ఈ వయసులో నాకు బయటకు వెళ్లలని లేదు.. అభివృద్ధి కోసం సీఎం తో కల్సి పనిచేస్తే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. పీ సి సి అధ్యక్షుడు మహిష్ కుమార్ గౌడ్ కల్సి ప్రయాణం చేద్దాం అంటారు.. 20 నెలలుగా నన్ను కించపరుస్తూ.. అడుక్కునే స్థాయికి తీసుకువస్తే ఏం చేయాలి.. మొన్నటి వరకు ప్రభుత్వం మాత్రమే ఎమ్మెల్యేకు అండగా ఉంది అనుకున్న. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా జత గా మారింది. ఇక మిగిలింది ఏముంది.. పదవులు ఇచే శక్తి లేకున్న.. కానీ ఆత్మ గౌరవం కాపాడాల వద్దా... మీనాక్షి నటరాజన్ 80 శాతం మీకే ప్రాధాన్యత ఉంటుందని హమీ ఇచ్చారు. శాసన మండలి లో ఒంటరి పోరాటం చేసిన.. నేను మంత్రి పదవికి అర్హుడిని కాదా.. సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.. పి సీ సి అధ్యక్షుడిగా నన్ను సోనియా గాంధీ నిర్ణయించుకున్న తర్వాత మారుతుందా.. పెట్టుబడి దారులు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఉన్నాయని వాయిదా వేశారు పీ సీ సి అధ్యక్ష స్థాయి వ్యక్తిని నియోజక వర్గంలో నా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఎదగకుండా అణగదొక్కాలని..రేవంత్ రెడ్డి ఆలోచన.. ఎదిరించి పోరాటం చేయం నాకు కొత్త కాదు. చంద్రబాబును, కెసిఆర్ ను ఎదిరించి పోరాటం చేసిన.రేవంత్ రెడ్డిను ఎదిరించి పోరాటం చేస్తా.. ఎదిరొస్తే పోయేది ఏముంది.. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఎంతకాలం ఈ మానసిక క్షోభ.. నీ అడుగులకు మడుగులు మడుగు లు ఒతేవారు..కావాలి..మీకు ఎదిరించే వారు వద్దు.. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేవాడినిపై అణగదొక్కుంటున్నారు. వేం నరేంద్ర రెడ్డి ఎవరు.. చిన్న రెడ్డినీ తనకు జరిగిన అవమానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాది..అడ్డు వేస్తే తొక్కుత అంటున్నారు. ఎంత మంది తొక్కుతారు..అని నిలదీశారు. మమ్మల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. కార్యకర్తలను గౌరవించడం తెలుసుకో.. నాలుగు దశాబ్దాలుగా అండగా నిల్చిన కార్యక్తలు నాకు తోడుగా నిలవాలని కోరుకున్న. దేవుడు అవకాశం ఇస్తే జగిత్యాలను జాతీయ స్థాయిలో గుర్తు వచ్చేలా అభివృద్ధి చేస్తా..రెండేళ్లు అవమానాలతో గడిచిపోయింది. మిగిలిన రెండేళ్లు పోరాటం చేద్దాం..అని పిలుపునిచ్చారు. మన హక్కుల కోసం.. ధర్మ కోసం పోరాటం చేద్దాం..... నాకు అండగా నిలువండి. నేను అనుభవించిన మానసిక క్షోభను వ్యక్తం చేసిన.. నేను ముఖ్యమంత్రిని కావలనీ కోరుకోలేదు.. మీ తొక్కుడు భరించలేక.. స్వేచ్ఛ కోరుకుంటున్న..మమ్మల్ని బతుకన్నివ్వండి.. ఇకనైనా కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల రక్షిస్తారని కోరుకుంటున్న. నా తోడు నిలిచేందుకు ముందుకు వచ్చే వారందరూ చేయి ఏథాలనీ పిలుపునివ్వగా అభిమానుకు, నాయకులు నినాదాలు చేస్తూ చేయి ఎత్తి మద్దతు తెలిపారు. రాజీనామా పత్రం విడుదల చేసి, కాంగ్రెస్ పార్టీ కండువా తీసేసి, ఆకు పచ్చ కండువా మెడలో కప్పుకున్నారు. కార్యకర్తలు.. అభిమానులు.. నాయకులు మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తాం.. జీవన్ రెడ్డి వెంటే నడుస్తాం. జగిత్యాల మరో జైత్ర యాత్ర మొదలవుతుంది.. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అవమానించిన తీరు పై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ కి రాజీనామా చేస్తున్నాం.. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ కి అండగా నిలుస్తూ, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన జీవన్ రెడ్డికి మద్దతు నిలుస్తాం.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వీడడం అంటే ఎంత బాధ ఉంటే వేడుతమో తెలుసుకోవాలని అన్నారు.. జీవన్ రెడ్డి వెంట ఉండి సైనికులుగా పోరాటం చేస్తాం.. జగిత్యాల పోరాటాల గడ్డ.. ఎక్కడి నుండి మరో జైత్ర యాత్ర పోరాటం చేస్తాం.. జీవన్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన జీవన్ రెడ్డిని అవమాన పరుస్తూ, పార్టీ నుండి వెళ్ళిపోయేలా చేసిన వారికి అదే గతి పడుతుంది.. 40 ఏళ్ల అనుబంధాన్ని తెగ్గిసిన వారికి అదే గతి పడుతుంది.. కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయింది. జీవన్ రెడ్డి వెంటే ఉంటాం..జీవన్ రెడ్డి ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం. పదవులు కాదు.. ఆత్మ గౌరవమే ముఖ్యం.. జీవన్ రెడ్డి పార్టీని వీడి పోవడం పై కన్నీరు పెట్టుకున్నారు. కార్యకర్తల కళకళ తలుగుతది. కాంగ్రెస్ పతనం జగిత్యాల నుండే ప్రారంభం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నీ కుటుంబంగా భావించినం... ఓపిక నశించి.. పార్టీ వీడాల్సి వస్తుంది.. జగిత్యాల జిల్లా మండల అధ్యక్షులు ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఉప సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, జిల్లా ఫిషరీస్ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, వందలాది మంది కార్యకర్తలు, సర్పంచులు, కౌన్సిలర్లు, బతికేపల్లి సర్పంచ్, మండల మాజీ అధ్యక్షులు, వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బీర్పూర్ మాజీ ఎంపీ పీ, యూత్ కాంగ్రెస్ స్టేట్ జెనరల్ సెక్రటరీ పదవితోపాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. యూత్ కాంగ్రెస్ జగిత్యాల్ అసెంబ్లీ నియోజక వర్గం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగిత్యాల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవికి, రాజీనామా. రాష్ట్ర మహిళా కార్యదర్శి రాజీనామా చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :