DNB News - తెలంగాణ / : Vijayawada లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ హోటల్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే అతను ట్రిగ్గర్ నొక్కినప్పటికీ తుపాకిలో ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటికి రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 9 ఎం ఎం తుపాకి మరియు ఐదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం దుండగుడిని పోలీసులు విచారిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
Admin
DNB News