Thursday, 17 September 2026 06:22:21 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

సమానత్వ జ్యోతి వెలిగించిన మహానేత జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా

Date : 11 April 2026 06:37 PM Views : 112

DNB News - తెలంగాణ / : మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామపంచాయతీ కార్యాలయంలో మహానుభావుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల సైదులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రేపాల గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేశారు.అనంతరం మాట్లాడుతూ.అణగారిన వర్గాల హక్కుల కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినదని పేర్కొన్నారు. జయంతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ మమత పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించి వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించేందుకు సంకల్పం వ్యక్తం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :