Saturday, 01 August 2026 08:04:12 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి

Date : 14 March 2026 05:42 PM Views : 81

DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలో హృదయ విదారకరమైన సంఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి కథ అందరినీ కలచివేస్తోంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన గండేపల్లి మణికంఠ అనే విద్యార్థి స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం అతనికి వార్షిక పరీక్ష ఉండగా, అంతకుముందు రోజు శుక్రవారం తెల్లవారుజామున అతని తండ్రి గండేపల్లి కొండలరావు అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పితృవియోగాన్ని తట్టుకుని కూడా మణికంఠ తన భవిష్యత్తు కోసం ధైర్యంగా ముందుకు వచ్చి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఘటన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల హృదయాలను కలచివేసింది. కొండలరావు డిగ్రీ వరకు చదివినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు కొనసాగించలేకపోయారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇటీవల కామెర్ల వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ భారం ఆయన భార్య శ్రీలక్ష్మి మీద పడింది. సరైన వైద్యం చేయించుకునే స్థోమత లేక వ్యాధి ముదరడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తాను ఉన్నత చదువులు కొనసాగించాలని ఉందని, దాతలు సాయం చేయాలని విద్యార్థి మణికంఠ కోరుతున్నాడు. ఈ ఘటన బత్తులపల్లి గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :