Friday, 18 September 2026 06:56:36 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

విద్యార్థులు, మహిళల భద్రతకు అంకితమైన “పోలీస్ అక్క”కు జాతీయ స్థాయి గౌరవం

Date : 28 March 2026 03:24 PM Views : 93

DNB News - తెలంగాణ / : మహిళలు,విద్యార్థినుల భద్రత కోసం అమలు చేస్తున్న పోలీసు అక్క కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డును జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ ఈరోజు ఢిల్లీలో అందుకున్నారు. నేటి సమాజంలో మహిళలు, విద్యార్థినుల భద్రత అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మారిన వేళ, నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ ప్రారంభించిన “పోలీస్ అక్క” కార్యక్రమం, విద్యార్థినులతో పాటు మహిళల భద్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సమగ్ర కమ్యూనిటీ పోలీసింగ్ మోడల్‌గా నిలిచి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. “పోలీస్ అక్క” కార్యక్రమం మహిళా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నడిచే కమ్యూనిటీ పోలీసింగ్. ఈ కార్యక్రమం ద్వారా బాలికలకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” పై అవగాహన కల్పించడమే కాకుండా, భావోద్వేగ, మానసిక, శారీరక భద్రతపై కూడా శిక్షణ అందిస్తున్నారు. మహిళా పోలీస్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోల్లింగ్ చేస్తూ , “డయల్-100” కాల్స్ తో అత్యవసర సేవలతో ప్రజలకు తక్షణ సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళా పోలీస్ అధికారులు “పోలీస్ అక్క”లుగా మారి, అక్కలా మహిళలకు, బాలికలకు నమ్మకమైన భరోసా ఇస్తున్నారు. ప్రతి నెల KGBV పాఠశాలలో పోలీస్ అక్కలు ఒక రోజు రాత్రి బస చేస్తూ, విద్యార్థుల సమస్యలను వినడం, కౌన్సిలింగ్ చేయడం, వారి భద్రతపై అవగాహన కల్పించడం, సమస్యల పరిష్కారం చేయడం వంటి సేవలను అందిస్తున్నారు. అలాగే నేటి సమాజంలో మహిళలు వేధింపులు, గృహహింస , స్టాకింగ్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. భద్రతా చట్టాలపై అవగాహన తక్కువగా ఉండటం, పోలీసులను సంప్రదించడంలో సంకోచం ఉండటం కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థినులకు ,మహిళలకు ఒక కుటుంబ సభ్యుల్లాంటి నమ్మకమైన వ్యక్తిని కోరుకున్నారు — ఆ అవసరాన్ని “పోలీస్ అక్క” తీర్చింది. “పోలీస్ అక్క” కార్యక్రమం ద్వారా సుమారు 7,000 మంది విద్యార్థినులకు, మహిళలు నేరుగా ప్రయోజనం పొందారు. ఇప్పుడు విద్యార్థినులకు, మహిళలు తమ సమస్యలను నేరుగా చెప్పుకోవడం వల్ల , సమయానుకూల చర్యలు తీసుకునే అవకాశం పెరిగింది. POCSO చట్టం, సైబర్ భద్రత, బాల్య వివాహాల నివారణపై విద్యార్థినులకు మహిళలకు అవగాహన పెరిగింది. మహిళా పోలీసులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, వచ్చిన డయల్ 100 కాల్స్ కు తక్షణ స్పందన అందించి బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు. చిన్న ఆలోచన నుంచి జాతీయ గుర్తింపు వరకు… ఇంతింతై వటుడింతై అన్నట్టుగా,రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మల్ జిల్లాలో ప్రారంభం అయి,మహిళలు,విద్యార్థినుల భద్రత,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రూపుదిద్దుకున్న “పోలీస్ అక్క” కార్యక్రమం నేడు జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపును సాధించి ప్రతిష్ఠాత్మక స్కాచ్(SKOCH) అవార్డుకు ఎంపికయ్యింది.రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రారంభమైన ఈ కార్యక్రమం, చిన్న స్థాయిలో మొదలై నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. మహిళలు,విద్యార్థినుల భద్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రయత్నం, సమాజంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలికింది. ఈ వినూత్న కార్యక్రమం నేడు ప్రతిష్ఠాత్మకమైన SKOCH అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణం.SKOCH నిర్వహించిన అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా, పోలీస్ అక్క అన్ని దశల్లో తనదైన ప్రదర్శనలను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ స్వయంగా హాజరై ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ సందేశం: “పోలీస్ అక్క కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి మహిళా పోలీస్ సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరి కృషి, నిబద్ధత, సేవాభావం వల్లే ఈ కార్యక్రమం ఈ స్థాయికి చేరుకుంది. ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం.విద్యార్థినులు భయపడకుండా తమ సమస్యలను చెప్పగలగడం, పోలీసులను నమ్మకంగా చూసే స్థితికి రావడం ఈ కార్యక్రమం సాధించిన గొప్ప విజయం. మనం కేవలం చట్టాన్ని అమలు చేసే అధికారులు మాత్రమే కాదు, సమాజానికి మార్గదర్శకులు కూడా. ముఖ్యంగా బాలికల భద్రత విషయంలో మన బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ SKOCH అవార్డు మనకు వచ్చిన గౌరవం మాత్రమే కాదు, మనపై మరింత బాధ్యతను పెంచుతుంది. ఇకపై ఇంకా మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత మన అందరిది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, ప్రతి బాలికకు భద్రత, నమ్మకం, ధైర్యం కల్పించడమే మన లక్ష్యం.సమాజంలో మార్పు ఒక్కరోజులో రాదు. కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు కలసి పెద్ద మార్పుకు దారితీస్తాయి. ‘పోలీస్ అక్క’ కూడా అలాంటి మార్పుకు నాంది. ఈ గౌరవం నిర్మల్ జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ట్రానికి, దేశానికే గర్వకారణం. మన సేవలు ఇలాగే ప్రజలకు ఉపయోగపడేలా కొనసాగిద్దాం. ప్రతి విద్యార్థిని భద్రంగా, ధైర్యంగా, సంతోషంగా ఎదగాలి — అదే మన విజయానికి నిజమైన అర్థం.” అని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ (పోలీస్ అక్క) సందేశమిచ్చారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: