DNB News - తెలంగాణ / : సూర్యాపేట జిల్లా: కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి65పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచిఏలూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందున్నలారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సులో 36 మందిప్రయాణికులు ఉండగా, అందులో 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించారు. మెయిన్ డోర్ తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడ్డారు. అయితే డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
DNB News