DNB News - తెలంగాణ / : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని "మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి - కుల వృత్తులను ప్రోత్సహించండి" నినాదంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లకు ఉగాది మట్టి పాత్రలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.. అందులో ఉగాది పండగ కి ఉపయోగపడే మట్టి కుండా, గ్లాస్ లు , జగ్గు ,బౌల్, షడ్రుచులు ఉండే మామిడి కాయలు , వేప పువ్వు , బెల్లం , చింతపండు ,కారం వస్తువులు ఉగాది కిట్ లో అందజేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని కాపాడడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రలు ఉపయోగించాలని , ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మన సంస్కృతి సంప్రదాయాలకు పండగలతో మట్టి పాత్రలు అనువైనవనని మంత్రి పొన్నం ప్రభాకర్ మట్టి పాత్రలు వినియోగాన్ని పెంచి కుల వృత్తులను కాపాడడానికి అందజేశారని వారు పేర్కొన్నారు. మట్టి పాత్రలు వాడకం తరతరాల సంప్రదాయం.. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయనీ ఉగాది సందర్భంగా మట్టి పాత్రలు వాడండి ,కుల వృత్తులను కాపాడండి .. ఆరోగ్యాన్ని రక్షించుకోండి అనే నినాదంతో పండగ జరుపుకోవాలని సూచించారు.
Admin
DNB News