Friday, 17 April 2026 05:09:48 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

నేడే "బహుజన గళం" అతిథులుగా హాజరుకానున్న కూనంనేని, మేయర్

Date : 09 April 2026 06:35 PM Views : 20

DNB News - తెలంగాణ / : అణ గారిన వర్గాలకు ఆద్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు బడుగు, బలహీన వర్గాలు ఐకమత్యంతో ముందుకు సాగాలని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వారసుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వానపాకుల రాంబాబు అన్నారు. మున్సిపల్ పరిధి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో బహుజన నాయకులతో కలిసి, గురువారం పాత్రికేయులతో మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొమరం భీమ్ ప్రాంగణంలో శుక్రవారం ధూమ్ దాం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాష లు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ వాదం ఉట్టిపడేలా తెలంగాణ కళాకారులు పాటమ్మ రాంబాబు, చుక్క రాంనర్సయ్య, పమ్మి రవి లచే సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. నేడే బహుజన గళం ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహుజనుల ఆద్యులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడుతూ.. ధూమ్ ధామ్ కార్యక్రమం ఉంటుందని వానపాకుల పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేటర్లను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మెమొంటో లు అందజేస్తామన్నారు. బహుజనులు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద మొత్తంలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు శివాటి మల్లేష్, ఉపాధ్యక్షులు గంగాధర సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లూరి సాంబశివరావు, భరత్ చంద్ర, ఇరుగు రాజు, మెంతిన సమ్మయ్య, మహిళా నాయకురాళ్లు పూనెం సీత, నక్క లావణ్య, అనపర్తి పుష్ప, కొమరం సరస్వతి లు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :