DNB News - తెలంగాణ / : నమ్మిన సిద్ధాంతం కోసం తను మోసిన ఎర్రజెండా ఆశయాల కోసం కడవరకు నిలబడ్డ నికార్సైన కమ్యూనిస్ట్ కామ్రేడ్ ఉయ్యాల కొండయ్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామ సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ ఉయ్యాల కొండయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భౌతిక ఖాయం పై పూలమాల వేసి జోహార్లు అర్పించిన అనంతరం జరిగిన అంతిమ యాత్ర లో ఆయన మాట్లాడుతూ కొండయ్య చిన్నతనం నుండే ఎర్రజెండా ఎత్తుకొని దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొనీ ఎత్తిన ఎర్రజెండాను దించకుండా పార్టీని కాపాడటంలో కొండయ్య ముఖ్య పాత్ర పోషించాడానీ అన్నారు.కొండయ్య గారు చిన్న వయసు నుండి ఎత్తిన ఎర్ర జెండా భుజాన వేసుకొని జెండాలు దించకుండా ఆటుపోటులు,నిర్బంధాలు ఎదురైనా కూడా గ్రామంలో ముఖ్యనాయకత్వం హత్యకు గురైన మొక్కవోని ధైర్యంతో పార్టీ కోసం సైనికుడి లాగా పని చేశాడని అన్నారు.గ్రామంలో ఎర్రజెండా పట్టుకొని కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలబెట్టడంలో కొండయ్య ముఖ్య పాత్ర నిర్వహించాడానీ అన్నారు.ఆదిరెడ్డి గారికి కుడి భుజంగా ఉండి గ్రామంలో పార్టీని కాపాడుతూనే నిర్బంధాలు సైతం లెక్కచేయకుండా పనిచేశారని అన్నారు. ఆయన వార్డు మెంబర్ గా, సింగిల్ విండో డైరెక్టర్ గా,గీత కార్మిక సంఘంలో అనేక బాధ్యతలు నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాడని అన్నారు. గ్రామంలో ప్రజల మధ్య ఎలాంటి పంచాయతీలు వచ్చిన పెద్దన్న పాత్ర పోషించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేశాడని అన్నారు. ఆయన పని చేయడమే కాకుండా తన కొడుకు ఉయ్యాల నర్సయ్య ను విద్యార్థి,యువజన ఉద్యమంలో పనిచేసే విధంగా ప్రోత్సహించారని అన్నారు. నరసయ్య కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుండి పార్టీలో పనిచేసి తన వంతు పార్టీ కోసం పని చేస్తున్నాడని అన్నారు. గ్రామంలో అభివృద్ధి కోసం కృషిచేసిన కొండయ్య సమసమాజ స్థాపన కోసం పోరాటం చేయడంలో కొండయ్య ముందు వరుసలో ఉన్నాడని అన్నారు. పూటకొక పార్టీలు మారుతున్న ఈ రోజుల్లో చిన్నతనం నుండి కడవరకు ఎర్రజెండా పట్టుకొని పోరాటం చేసిన కొండయ్య బ్రతికినంత కాలం తన కుటుంబాన్ని పోషించుకుంటూనే గ్రామాభివృద్ధి కోసం పాటుపడి ప్రజలకు సేవ చేసాడని పేర్కొన్నారు. ఈ దేశంలో అందరికీ దోపిడీ లేని సమాజం రావాలని ఎర్రజెండా పట్టుకుని అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. కొంతమంది నాయకులు కష్టాలు,ఇబ్బందులు రాగానే పార్టీలు మారుతున్న ఈ రోజుల్లో కొండయ్య మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ అధిగమించి ఎర్రజెండా కోసం పరితపించి పనిచేశాడని అన్నారు. నీతి నిజాయితీగా పార్టీకోసం పనిచేసిన కొండయ్య ఆశయ సాధనకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతిమయాత్రకు ముందుగా కొండయ్య భౌతిక కాయంపై సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. కొండయ్య గారి మృతికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున సంతాపం సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నిమ్మాది వెంకటేశ్వర్లు కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు,కోట గోపి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి, ధనియాకుల శ్రీకాంత్,పల్లె వెంకట్ రెడ్డి,వత్తెపు సైదులు, మిట్టగడుపుల ముత్యాలు, షేక్ సైదా,నరసింహారావు సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అనంతగిరి హుజూర్నగర్ రూరల్ మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ, హుస్సేన్ జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు సిపిఎం గ్రామ కమిటీ కార్యదర్శి జూలకంటి కొండారెడ్డి గ్రామ సర్పంచ్ కుంచం ఇందిరా నరసయ్య ఉపసర్పంచ్ మొగిలిచర్ల సీతారాములు సిపిఎం మండల కమిటీ సభ్యులు స్టాలిన్ రెడ్డి,మండవ వెంకటాద్రి,వీరబోయిన వెంకన్న,సోమపంగ నరసయ్య, తుమ్మల సతీష్ గ్రామ శాఖ నాయకులు మార వెంకట్రెడ్డి బొంత స్వరూప వార్డు మెంబర్లు నాగమణి నారాయణ రమేష్ రాములమ్మ రేణుక శివ డివైఎఫ్ఐ నాయకులు కోడి సత్యనారాయణ షేక్ ఖాసిం వల్లి గ్రామ నాయకులు న్యాయవాదులు రాధాకృష్ణమూర్తి సుధాకర్ రెడ్డి శరత్ బాబు హనుమంతరావు కోటిరెడ్డి సూర్యాపేట న్యాయవాదులు నూకల సుదర్శన్ రెడ్డి బత్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News