Saturday, 01 August 2026 07:18:18 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

దోపిడీ జరిగిన 11 రోజుల్లోనే అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Date : 20 May 2026 09:57 AM Views : 53

DNB News - తెలంగాణ / : గత కొద్ది రోజుల క్రితం కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలరీలో జరిగిన భారీ నగల దోపిడీ కేసును కేవలం 11 రోజుల వ్యవధిలోనే చేధించి, అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం కి మరియు పోలీసు బృందానికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేడు పులి ఆంజనేయులు గౌడ్ పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి పోలీస్ కమిషనరేట్ లో కమిషనర్ గౌస్ ఆలం ని ప్రత్యేకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తుందని స్పష్టం చేశారు. దొంగతనం జరిగిన 11 రోజుల్లోనే దుండగులను పట్టుకోవడం పోలీసు శాఖ చిత్తశుద్ధికి, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై ప్రతిపక్షాలు కావాలని దుష్ప్రచారం చేయాలని ఉబలాటపడటం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. పోలీసులు రేయింబవళ్లు కష్టపడి కేసును చేధిస్తుంటే, ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇంట్లో కూర్చుని అసత్య ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పనిచేసే పోలీస్ వ్యవస్థపై పౌరులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు గౌరవంగా, హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే పోలీసులను అభినందించాలే తప్ప, రాజకీయ లబ్ధి కోసం నిందలు వేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేరస్తులు ఎంతటివారైనా తప్పించుకోలేరని, ఇదే ఘటన దానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తాడిజెర్రి సర్పంచ్ రామిడి రాజిరెడ్డి, కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ నూనె గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వంగల విద్యాసాగర్, కుంబాల రాజ్ కుమార్, గంగుల దిలీప్ కుమార్, బండిపెల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: