DNB News - తెలంగాణ / : చర్మకారుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలపై కొత్తగూడెం ప్రాంత చర్మకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత నేత ముసుగులో తిరుగుతూ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన చామరు అనే వ్యక్తి వ్యవహరిస్తున్న తీరు చర్మకారుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. ఈ సందర్బంగా కొత్తగూడెం సూపర్ బజారు పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్మకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు జైదాల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ స్థానిక చర్మకారులను సంప్రదించకుండా కొంతమందినే ఎంపిక చేసి సమావేశాలకు పిలవడం వెనుక ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. చర్మకారుల సమాజాన్ని విభజించి రాజకీయ ఉనికి పెంచుకోవడానికే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఒక వర్గాన్ని ముందుకు తెచ్చి మిగతావారిని పక్కన పెట్టడం సమాజ ఐక్యతను బలహీనపరచే కుట్రగా పేర్కొన్నారు. సమాజం మొత్తానికి సంబంధించిన విషయాల్లో అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కానీ కొందరిని మాత్రమే ప్రాధాన్యంగా తీసుకుని కార్యక్రమాలు నిర్వహించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఇది చర్మకారుల మధ్య అనవసర విభేదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కొత్తగూడెం చర్మకారులు స్పష్టంగా పేర్కొంటూ తమ సమాజాన్ని ఎవరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని చెప్పారు. చర్మకారుల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే స్థానికులందరినీ కలుపుకొని పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. చర్మకారుల ఐక్యతే తమ బలం అని విభజన రాజకీయాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. అవసరమైతే ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పిట్టల సతీష్, పెద్దపులి నాగేంద్ర బాబు, ఆముదాల ప్రసాద్, ఆముదాల రాజేష్ తదితరులు ఉన్నారు.
Admin
DNB News