Tuesday, 03 November 2026 01:47:25 PM
# మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!!

తెలంగాణ – టాంజానియా మధ్య డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సహకారం

Date : 14 March 2026 04:50 PM Views : 109

DNB News - తెలంగాణ / : టాంజానియా దేశం డిజిటల్ ఎకానమీ వైపు మార్పు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక సహకారం మరియు సంస్థాగత మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాంజానియా కమ్యూనికేషన్, ఐసీటీ మరియు ఇన్నోవేషన్ మంత్రి ముద్రిక్ రమధాని సోరాగా నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల మధ్య పలు రంగాల్లో సహకారం పెంపు అవకాశాలపై చర్చించారు. సమాచార సాంకేతికత, పర్యాటకం, ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి రోడ్‌మ్యాప్ రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డిజిటల్ మార్పు సమగ్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారిందని పేర్కొంటూ, టాంజానియా డిజిటల్ ఎకానమీ నిర్మాణంలో తెలంగాణ తన అనుభవం, సాంకేతిక నైపుణ్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. అదే సమయంలో టాంజానియాలో ఔషధాలు మరియు ఆరోగ్య ఉత్పత్తుల సరఫరా కోసం ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. పౌర సేవల అందజేతలో మీ సేవా (MeeSeva) విధానం, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం కల్పించే WE Hub, స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ బలోపేతం వంటి అంశాల్లో తెలంగాణ నలెడ్జ్ పార్ట్నర్‌గా ఉండగలదని తెలిపారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలకు కూడా సహాయం అందించవచ్చన్నారు. ఈ సందర్భంగా టాంజానియా మంత్రి సోరాగా మాట్లాడుతూ, డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కోసం తెలంగాణ వంటి ప్రగతిశీల ప్రాంతాలతో కలిసి పనిచేయాలని తమ దేశం ఆసక్తిగా ఉందన్నారు. ఐటీ, ఆరోగ్యం, మెడికల్ టూరిజం, డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలు తమకు ప్రేరణనిచ్చాయని తెలిపారు. త్వరలో తెలంగాణతో పరస్పర సహకారాన్ని అధికారికంగా అమలు చేసేందుకు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో టాంజానియా కమ్యూనికేషన్, ఐసీటీ మరియు ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి ఫాత్మా మబ్రూక్ ఖమిస్, జాంజిబార్ ఐసీటీ అథారిటీ సీఈఓ షుకురు అవాద్ సులేమాన్, ప్రెసిడెంట్ డెలివరీ బ్యూరో టెక్నాలజీ & ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ జాన్ మహుండి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :